గోంగూర పుల్లకూర

మిక్స్‌డ్ దాల్స్ దోశె

ఎగ్ బిర్యానీ

టమాటా పలావ్‌

పాల చాక్లెట్;

ఉగాది పచ్చడి;

పెరుగు గారెల

పెరుగు గారెలకు కావలసిన వస్తువులు

పెరుగు - అర లీటరు
మినప్పప్పు - పావుకిలో
పచ్చి మిర్చి - 6
అల్లం - అంగుళం ముక్క
ఉప్పు - తగినంత
కరివేపాకు - 5 రెమ్మలు
పోపు సామాను - 2 టేబుల్‌ స్పూన్లు
నూనె - అర కిలో

పెరుగు గారెల తయారు చేయు విధానం

మామూలు గారెలకు నానబెట్టినట్టే మినప్పప్పు నానబెట్టి శుభ్రంగా కడిగి అందులో కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. పెరుగు గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు గానీ మజ్జిగ గానీ కలిపి పల్చగా చేసుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, కరివేపాకు మెత్తగా నూరి ఈ మజ్జిగలో కలిపి పోపు పెట్టుకోవాలి. బాండీలో నూనె వేసి బాగా కాగిన తర్వాత రుబ్బి పెట్టుకున్న పిండిని గారెల్లా చేసుకుని పక్కనే పెట్టుకున్న పోపు వేసిన పెరుగులో వేసుకోవాలి. ఈ గారెలు పెరుగులో కొద్దిగా నానిన తర్వాత తింటే చాలా బావుంటాయి.

జాంగ్రీ

జాంగ్రీ కావలసినవి : 

మినప్పప్పు : 2 కప్పులు,
పంచదార : 3 కప్పులు,
మంచినీళ్లు : 2 కప్పులు,
ఆరెంజ్‌ కలర్‌: టీ స్పూన్‌,
యాలకుల పొడి : అర టీ స్పూన్‌,
నెయ్యి లేదా నూనె : వేయించడానికి సరిపడా

జాంగ్రీ తయారీ : 

మినప్పప్పుని రాత్రంతా నానబెట్టి రుబ్బుకోవాలి. తరవాత అందులో రంగు వేసి కలపాలి. మిక్సీలో పిండిని రుబ్బితే తరవాత చేత్తో బాగా గిలకొట్టాలి. ఇప్పుడు దీన్ని 3 గంటలు పులియనివ్వాలి. వాతావరణం చల్లగా ఉంటే ఆరు గంటలు పులియనివ్వాలి. పపంచదారలో నీళ్లు పోసి పలుచని తీగపాకం రానివ్వాలి. తరవాత యాలకుల పొడి వేసి ఉంచాలి. బాణలిలో నెయ్యి పోసి కాగనివ్వాలి. ఇప్పుడు రంధ్రం ఉన్న ప్లాస్టిక్‌ బాటిల్‌ / బట్టలో పిండి మిశ్రమం వేసి జాంగ్రీల్లా చుట్టి తక్కువ మంట మీద వేయించి తీసి పాకంలో ముంచి నాలుగైదు నిమిషాలు ఉంచి తీయాలి.

కోకో ఐస్‌క్రీమ్‌

కోకో ఐస్‌క్రీమ్‌ కావలసిన పదార్థాలు

పాలు - 1 లీటర్‌,
క్రీమ్‌ - అరకిలో
పంచదార - 100 గ్రాములు
కోడిగుడ్లు - 10,
కోకో పౌడర్‌ - 6 టీ స్పూన్లు

కోకో ఐస్‌క్రీమ్‌  తయారీ విధానం

       పాలు మరిగించి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో కోడిగుడ్ల తెల్లసొనలో పంచదార, మరిగించిన పాలు కలిపి సిమ్‌లో ఉడికించాలి. ఈ మిశ్రమం చిక్కబడిన తర్వాత చల్లార్చాలి. అందులో కోకో పౌడర్‌ కలిపి ఫ్రీజర్‌లో పెట్టాలి. గట్టి పడిన ఈ మిశ్రమాన్ని గ్రైండ్‌ చేసి తిరిగి ఫ్రీజర్‌లో పెట్టాలి. గట్టి పడిన ఐస్‌క్రీమ్‌ని మరోసారి గ్రైండ్‌ చేస్తే మెత్తగా నురగలు తేలుతున్న కోకో ఐస్‌క్రీమ్‌ వస్తుంది. దీన్ని ఓ గంట ఫ్రిజ్‌లో పెట్టి తినేయొచ్చు.

కొత్తిమీరరైస్‌

కొత్తిమీరరైస్‌ కావలసిన పదార్థాలు: 

కొత్తిమీర కట్టలు-3, 
బియ్యం-అర కిలో, 
జీలకర్ర, ఆవాలు-రెండు టీ స్పూన్స్‌, 
పచ్చి మిరపకాయలు-6, 
అల్లం ముక్కలు-1 టేబుల్‌ స్పూన్‌, 
వేరుసెనగ గుళ్ళు-1 టేబుల్‌ స్పూన్‌, 
జీడిపప్పు-1 టేబుల్‌ స్పూన్‌, 
ఉప్పు-తగినంత

కొత్తిమీరరైస్‌ తయారుచేసే విధానం

ముందుగా అన్నం వండి పక్కన ఉంచుకోవాలి. ఆ తరువాత పొయ్యి మీద మూకుడు ఉంచి నూనె కాగిన తర్వాత కొత్తిమీర వేయించి దానిలో జీలకర్ర , ఆవాలు, పచ్చి మిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, వేరుసెనగ గుళ్ళు, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత పసుపు, ఉప్పు, వండి పెట్టుకున్న అన్నం వేసి బాగా కలియబెట్టాలి. ఇంకేముంది! కొత్తి మీర రైస్‌ రెడీ!

టొమాటో సూప్‌

టొమాటో సూప్‌ కావలసిన పదార్థాలు:

టొమాటో ముక్కలు - 4 కప్పులు
బిరియాని ఆకు - 1
మిరియాలు - పావు టీ స్పూను
వెన్న - ఒకటిన్నర టీ స్పూను
మైదా - 1 టే.స్పూను
టొమాటో గుజ్జు - పావు కప్పు
చక్కెర - 2 టీస్పూన్లు
ఉప్పు - తగినంత
మీగడ - ఒకటిన్నర టీస్పూను
 
అలంకరణకు:
 
తాజా మీగడ - 2 టీస్పూన్లు
వేయించిన బ్రెడ్‌ ముక్కలు - పావు కప్పు
 
టొమాటో సూప్‌  తయరీ విధానం:
 
టొమాటో ముక్కలకు ఒక కప్పు నీరు, బిరియాని ఆకు, మిరియాలు చేర్చి మీడియం మంట మీద 8 నుంచి 10 నిమిషాలు ఉడికించాలి. బిరియాని ఆకు తీసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ గుజ్జును మెత్తగా రుబ్బి వడగట్టాలి. బాండీలో వెన్న వేడి చేసి మైదా వేసి మీడియం మంట మీద 1 నిమిషంపాటు ఉడికించాలి. దీన్లో ముందుగా తయారుచేసిపెట్టుకున్న టొమాటో మిశ్రమం, టొమాటో గుజ్జు, ఒక కప్పు నీళ్లు చేర్చి కలిపి 1 నిమిషంపాటు ఉడికించాలి. చక్కెర, ఉప్పు, మిరియాలపొడి, మీగడ వేసి కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. తాజా మీగడ, బ్రెడ్‌ ముక్కలతో అలంకరించి సర్వ్‌ చేయాలి